సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): మల్లికార్జున స్వామి కృపతో ప్రజలు ఆనందంగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, సంధ్య దంపతులు, అనంతారం మాజీ సర్పంచ్ చిమ్ముల నరేందర్ రెడ్డి, దీపా దంపతులు ఆదివారం శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. మల్లికార్జున స్వామి కృపతో పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ యువ నాయకులు పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
Oplus_131072