సంగారెడ్డి/పటాన్ చెరు, జూన్ 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన చిన్నా ముదిరాజ్ సోమవారం గాంధీభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నా ముదిరాజ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ తనను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు చేస్తానని, పార్టీ బలోపేతం కోసం సమష్టిగా కృషి చేస్తానని అన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిన్నా ముదిరాజ్

Oplus_0