మోటార్ సైకిల్ నడిపిస్తున్న మైనర్ల కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించరు. ఇందులో భాగంగా మోటార్ సైకిళ్లు నడిపిస్తూ దొరికిన మైనర్లకు, వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి, మరల తిరిగి వాహనాలను నడపకుండా ఉండే విధంగా వారికి సూచించడం జరిగింది. అంతేగాక మైనర్ డ్రైవింగ్ పై కుటుంబ సభ్యులకు, పిల్లలకు చట్టప్రకారంగా పడే శిక్షల పై అవగాహన కల్పించినట్లు పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.