రోడ్లపై ధాన్యం ఆరపోయే వద్దు సీఐ ఎన్ రామకృష్ణ గౌడ్

*రోడ్లపై ధాన్యం ఆరపోయే వద్దు

*పట్టణ సీఐ ఎన్ రామకృష్ణ గౌడ్*

*జమ్మికుంట మే 19 ప్రశ్న ఆయుధం*

రైతులు పండించిన పంటలను రోడ్లపైన ఆరబోయవద్దని పోసిన ఎడల కేసులు తప్పవని జమ్మికుంట పట్టణ సీఐ ఎస్ రామకృష్ణ గౌడ్ అన్నారు రైతులు రోడ్ల పైన వరి ధాన్యం మొక్కజొన్నలు ఆరబోయడం వలన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్లపై ధాన్యం ఆరబోయడం వలన వాహనదారులకు రాత్రి వేళలో లైటింగ్కు కనపడక అదుపుతప్పి ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు రైతులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వారి పంట పొలాల వద్ద కల్లాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు ఒకవేళ ఎవరైనా రైతులు రోడ్లపై ధాన్యాలు ఆరబోసిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు రైతులపై పోలీసులకు గౌరవం ఉందని ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని కోరారు

Join WhatsApp

Join Now