*పోగొట్టుకున్న ఫోన్ ను దొరకబట్టి బాధితునికి అందజేసిన సీఐ రవి*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 8*
ఫోన్ జేబులో నుండి ఎక్కడో జారిపోయిందని స్థానిక పోలీస్ స్టేషన్లో చెన్న బోయిన సమ్మయ్య అనే ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేయగా జమ్మికుంట సీఐ రవి తన సిబ్బందితో ఎంక్వయిరీ చేయమని ఆదేశించగా వారు మొబైల్ యొక్క ఐ ఎం ఈ నెంబర్ ఆధారంగా దొరకబట్టి ఆ ఫోను శనివారం రోజున సమ్మయ్యకు స్థానిక పోలీస్ స్టేషన్లో పట్టణ సీఐ వర గంటి రవి అందజేశారు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని దుర్గ కాలనీకి చెందిన చెన్న బోయిన సమ్మయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు, జమ్మికుంట పట్టణ సీఐ రవి మాట్లాడుతూ ఫోన్లను జాగ్రత్తగా పెట్టుకోవాలని ఒకవేళ ఫోన్ లను ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లయితే ఫోన్ యొక్క ఐ ఎం ఈ నంబర్ ఆధారంగా దొరకబట్టి బాధితులకు అప్పగించడం జరుగుతుందని పట్టణ సీఐ తెలిపారు పోగొట్టుకున్న ఫోను తిరిగి దొరకబట్టి తనకు అప్పగించిన పట్టణ సీఐ వరగంటి రవికి ఉపాధ్యాయుడు సమ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు.