*గురుకుల పాఠశాలల ప్రవేశాల వాల్ పోస్టర్ ఆవిష్కరించిన సీఐ రవి*
*జమ్మికుంట జనవరి 13 ప్రశ్న ఆయుధం*
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రవేశాల వాల్ పోస్టర్ ను సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి ఆవిష్కరించారు అనంతరం సీఐ వరగంటి రవి మాట్లాడుతూ గురుకులాలను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు సమకూర్చడంలో ముందంజలో ఉందని ఆయన తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గురుకులాల ప్రిన్సిపాల్స్ సిహెచ్ లచ్చయ్య, ఇందిరా మాట్లాడుతూ దరఖాస్తు చేసుకోవడానికి గాను సర్టిఫికెట్లు జనన, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో ఏదైనా గురుకుల పాఠశాలను సంప్రదించాలని దరఖాస్తు చేసుకోవడంలో మేము వారికి సహకరిస్తామని వారు తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ:01-02- 2025 వరకు ఉందని 5వ తరగతి అడ్మిషన్ కు అన్ని బాలబాలికల గురుకులాలలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సైనిక్ స్కూల్ ఇతర పాఠశాలలలో బ్యాక్ లాగ్ అడ్మిషన్లకు అవకాశం ఉందని వారు తెలిపారు.