Site icon PRASHNA AYUDHAM

అమరావతిలో పాఠశాలలు దత్తత తీసుకున్న సినీ నటి..!

IMG 20250918 WA0016

అమరావతిలో పాఠశాలలు దత్తత తీసుకున్న సినీ నటి..! విద్యార్థులకు బంగారు భవిష్యత్తు హామీ..!

నటి, నిర్మాతగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి సేవా కార్యక్రమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘టీచ్ ఫర్ చేంజ్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, విద్యారంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు. తాజాగా ఆమె ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని పది ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవడం విశేషం. విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడేలా తమ సేవలు కొనసాగించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

ఇంతకుముందు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో పది ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నామనీ, ఇప్పుడు అమరావతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మరింత ఆనందంగా ఉందని మంచు లక్ష్మి తెలిపారు. తమ సంస్థతో పాటు మరికొందరు దాతలు ముందుకు రావడం వలన ఈ సేవా కార్యక్రమం మరింత విస్తరించిందని ఆమె వెల్లడించారు. దత్తత తీసుకున్న పాఠశాలల్లో విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునే వాతావరణాన్ని కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. “పిల్లల అభ్యాసం ఎక్కడా ఆగిపోకూడదు.

Exit mobile version