*సీఐఎస్ఎఫ్ కు తొలిసారి మహిళా పటాలం*
విమానాశ్రయాలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని తొలిసారి మొత్తం 1025 మంది మహిళలతో కూడిన సీఐఎస్ఎఫ్ రిజర్వు బెటాలియన్ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సీనియర్ కమాండెంట్ ర్యాంకు అధికారి నేతృత్వంలో ఈ ప్రత్యేక మహిళా రిజర్వు యూనిట్ ను ఆమోదిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.