Site icon PRASHNA AYUDHAM

క్యూబా ప్రజలకు అండగా నిలబడదాం..!!

క్యూబా
Headlines:
  1. “క్యూబాపై అమెరికా దిగ్బంధనానికి వ్యతిరేకంగా సిపిఐటియు నిరసన”
  2. “క్యూబా ప్రజలకు అండగా నిలబడదాం: సిపిఐటియు కార్యదర్శి కాముని గోపాలస్వామి”
  3. “క్యూబా పై దిగ్బంధనంపై సిపిఐటియు గళమెత్తింది”
  4. “క్యూబా ఆర్థిక సంక్షోభానికి కారణం అమెరికా దిగ్బంధనం: సిపిఐటియు సూచన”

క్యూబాపై అమెరికన్ సామ్రాజ్యవాద నిరంకుశ, నిర్భందాన్ని ఖండిద్దాం 

సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి పిలుపు

సిద్దిపేట అక్టోబర్ 29 ప్రశ్న ఆయుధం :

క్యూబా పై అమెరికా సామ్రాజ్యవాద నిరంకుశ నిర్బంధాన్ని ఖండిద్దాం, క్యూబాకు అండగా నిలబడదాం అని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. మంగళవారం రోజున స్థానిక గాంధీ సెంటర్ లో అమెరికా సామ్రాజ్యవాద వాదానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం ఈ సందర్భంగా కాముని గోపాలస్వామి మాట్లాడుతూ గత 31 సంవత్సరాలుగా జనరల్ అసెంబ్లీ “క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా విధించిన ఆర్థిక, వాణిజ్య మరియు ఆర్థిక దిగ్బంధనానికి ముగింపు పలకాలి” అనే తీర్మానాన్ని అత్యధిక మెజారిటీతో ఆమోదించింది. గత 63 సంవత్సరాలుగా దిగ్బంధనం వల్ల క్యూబా ఆర్ధికంగా 164.14 బిలియన్ డాలర్లను నష్టపోయింది. ద్రవ్యోల్బణం రీత్యా చూస్తే ఇది మొత్తం 1.499 ట్రిలియన్ డాలర్లు. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు అమెరికన్లు క్యూబాకు ప్రయాణించటానికి అడ్డంకులు కల్పిస్తూ అనేక కొత్త కొత్త నిబంధనలను జారీ చేసింది. అవే ఆంక్షలు, నిబంధనలు అమెరికా అధ్యక్షుడు బ్రెడెన్ పరిపాలనలో కూడా కొనసాగుతున్నాయి. ఈ నిబంధనల కారణంగా ఆహార దిగుమతులు తగ్గిపోయాయి. అమెరికా క్యూబా ను తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా ( ఎస్ ఎస్ ఓ టి )గా పరిగణిస్తున్నందున, ఇది క్యూబా యొక్క ఆర్థిక మరియు బ్యాంకింగ్ లావాదేవీలు, విదేశీ వాణిజ్యం, ఆదాయ వనరులు, ఎనర్జీ మరియు క్రెడిట్ లావాదేవీలకు తీవ్ర అవరోధం మారింది. క్యూబా ఆరోగ్య సంరక్షణ, ఆహారం మరియు వ్యవసాయ రంగాలకు వర్తించే విధంగా అమెరికా ఉద్దేశపూర్వకంగా నిషేధాలు మరియు పరిమితులను అమలుచేస్తున్నది. వీటిఫలితంగా ఆరోగ్య సంరక్షణలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు మరియు ఆపరేటింగ్ రూమ్లలో వినియోగించే విడిభాగాల, బ్లడ్ గ్యాస్ ఎనలైజర్లు, ఇమ్యునో డెఫిషియెన్సీ వ్యాధులను నిర్ధారించే రియాజెంట్లు, క్యాన్సర్ చికిత్సలకు ఉపయోగించే మందులు, ఔషధాలు, విడి భాగాలు మరియు నవజాత శిశువుల సంరక్షణకు వాడే కొత్త పరికరాలు మొదలైనవాటి సురక్షిత సరఫరాకు వాడే వస్తువుల కొరత ఏర్పడుతోంది. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ యంత్రాల నిర్వహణకు అవసరమైన ఇంధనం, నూనెలు మరియు లూబ్రికెంట్ల కొరత, ఎరువులు మరియు పురుగు మందుల కొరత టన్నుల కొద్దీ ఉత్పత్తులను శీతలీకరించే సామర్థ్యం కోల్పోవడం వంటి కారణాల వల్ల ఆహార ఉత్పత్తి తగ్గింది. ఈ దిగ్బంధనం వల్ల సహకార సంఘాలు మరియు రైతులు వాడే యంత్రాల కోసం విడి భాగాలు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు మరియు ఇతర రవాణా సాధనాలు అందుబాటులో లేక వ్యవసాయం స్తంభించిపోయినది. అలాగే సాగులో లేని భూమిని ఉత్పత్తికి ఉపయోగించేందుకు వాడే ముడి పదార్థాలు లేక ఇతర ఉత్పత్తులు నిలిచిపోయాయి. క్యూబా నేడు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దాదాపు మొత్తం ద్వీపంలోని 11 మిలియన్ల జనాభాలో 10 మిలియన్ల ప్రజలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అక్టోబర్ 17 న దాని ప్రధాన థర్మో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ యొక్క సేవలను నిలిపివేయటంతో మొత్తం విద్యుత్ వ్యవస్థ పతనమైంది. ఈ సంక్షోభానికి ముఖ్య కారణం థర్మో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లకు శక్తినిచ్చే ఇంధనం లేకపోవడం. ఇంధన చమురు తో కూడిన ఓడ రాక ఆలస్యమవటం వల్ల పరిస్థితి మరింత జటిలమైంది. దీనికి అంతిమ కారణం క్యూబా పై అమెరికా విధించిన వాణిజ్య మరియు ఆర్థిక దిగ్బంధనమే. ఈ దిగ్బంధనం యొక్క ప్రధాన లక్ష్యం ఆకలితో క్యూబా జనాభా మరణిస్తే, ప్రజలు వారి అధికారులకు వ్యతిరేకంగా తిరగబడతారు. అమెరికా యొక్క ఈ దుష్ట పన్నాగం నెరవేరలేదు. కానీ, క్యూబా ప్రజలు దైనందిన జీవితాన్ని గడపటానికి నిత్యావసరాల కొరత వల్ల అంతులేని కష్టాలు ఎదుర్కొంటున్నారు. అందుకని వారి సంఘీభావం తెలిపాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, బండి మల్లయ్య, సత్యనారాయణ, ప్రసాద్, ఎల్లయ్య, సతీష్, చందర్, కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version