మహిళలు బాలికలుపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలి. సిఐటియు, ఐద్వా! డిమాండ్!!

IMG 20240725 WA0097

ప్రశ్న ఆయుధం అన్నమయ్య స్టేట్ బ్యూరో జూలై25

రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న , అత్యాచారాలు, హత్యలు, అరికట్టాలని,  అన్నమయ్య జిల్లా, చిట్వేల్ మండలంలో , సిఐటియు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళల సంఘం ఐద్వా , ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది.  సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై పెద్ద ఎత్తున దాడులు అనేక రూపాల్లో జరుగుతున్నప్పటికీ అత్యాచారాలు అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల ప్రాంతంలో చిన్న పిల్లలపై అత్యాచారం చేసి రిజర్వాయువుల్లో పడేస్తే అలాంటి వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో వలస బాలికకు బిస్కెట్ పేరు చెప్పి అత్యాచారం హత్య చేయడం జరిగిందన్నారు.ప్రతిరోజు రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రతి గంటకు మహిళల పైన అత్యాచారం లైంగిక వేధింపులు మానభంగాలో జరుగుతున్న కూడా మహిళలకు ఉన్న చట్టాలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి విప్లమైందన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ మధ్య నిషేధం, గంజాయి అరికట్టాలన్నారు. గత ప్రభుత్వంలోగంజాయి వల్ల యువత చెడు మార్గం పట్టిందన్నారు.కాబట్టి దేశంలో మహిళలకు రక్షణ కావాలంటే బిజెపి ప్రభుత్వం నిరంకసత్వానికి వ్యతిరేకంగా పోరాడి మహిళల యొక్క హక్కులను, మహిళలకు కావాల్సిన చట్టాలను అమలు కావాలంటే పోరాటం తప్పదని మహిళా లోకానికి పిలుపునివ్వడం జరిగింది. మహిళలకు బాలికలకు రక్షణ కల్పించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు, పి జాన్ ప్రసాద్. సిఐటియు మండల కార్యదర్శి వై సుజాత, కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ ఓబిలి. పెంచలయ్య, ఐద్వా మండల నాయకురాలు నందు, లీలమ్మ, శంకరమ్మ, పద్మ, అంగన్వాడి వర్కర్స్ హెల్పర్ యూనియన్ సిఐటియు నాయకులు, శుభ రత్న ,రేవతి ,నాగమణి ,శాంతి, భాను, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now