దేశాయి బీడీ యాజమాన్యం కార్మికులను వేధించడం వెంటనే ఆపివేయాలి..

దేశాయి
Headlines (Telugu)
  1. దేశాయి బీడీ యాజమాన్యం కార్మికులను వేధించడం వెంటనే ఆపండి
  2. సిఐటియు – కార్మికుల శ్రమ దోపిడీపై కఠిన నినాదం
  3. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం – కె చంద్రశేఖర్

కార్మికులను వేధించడం వెంటనే ఆపివేయాలి..

-సిఐటియు డిమాండ్

కామారెడ్డి టౌన్
ప్రశ్న ఆయుధం నవంబర్ 02:

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం లో లేబర్ కమిషనర్ కి దేశాయి బీడీ కంపెనీ కార్మికుల పట్ల వేధింపులు మానుకోవాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది. దేశాయి బీడీ కంపెనీ యాజమాన్యం చేస్తున్నటువంటి దోపిడీ గురించి తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె చంద్రశేఖర్ మాట్లాడుతూ. కార్మికుల నుంచి వసూలు చేస్తున్నటువంటి పది రూపాయలు మన కామారెడ్డి జిల్లా పరిధిలో దాదాపు అనేక వేలకు పైగా కార్మికులు పనిచేస్తున్నారు ప్రతి నెలకు ఒక కోటి 60 లక్షల రూపాయలు పది రూపాయల పేరుతో యాజమాన్యం కార్మికుల శ్రమను దోపిడి చేస్తుంది. అలాగే చాటు పేరుతో శాంపిల్ పేరుతో తీసుకుంటున్నటువంటి బీడీని తక్షణమే ఆపివేయాలి ఆపెయ్యకపోతే హైదరాబాద్ సీఎం క్యాంప్ ఆఫీసులో ఫిర్యాదు చేస్తామని అలాగే సిఐడి ఎంక్వయిరీ కోరుతామని హెచ్చరిస్తున్నాం ఇకనైనా యాజమాన్యం తన తప్పు తెలుసుకొని కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపేయాలి కార్మికులు మాకు అన్యాయం జరుగుతుందని అడిగిన కార్మికులను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి తర్వాత బ్రాంచ్లలో చెకింగ్ పేరుతో విలేజ్ కి పోయి కార్మికులను భ్రయభ్రాంతులకు గురి చేస్తూ యూనియన్ ను సంప్రదించొద్దు అని చెప్తూ బెదిరించడం జరిగింది ఈ పద్ధతి వెంటనే ఆపివేయాలి ఇది ఇలాగే కొనసాగితే మేము తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గా మేము ఎలాంటి పోరాటాల కైనా సిద్ధమని యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కర్రోల్ల సత్యం జిల్లా నాయకులు బోనగిరి శ్రీహరి పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now