Site icon PRASHNA AYUDHAM

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ డిమాండ్

IMG 20241215 WA0002 1

 

 

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 15 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

 

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి చర్చలకు పిలిచి సమ్మె విరమింప చేయాలి. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి. డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శివ్వంపేట స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం నాయకులను చర్చలకు పిలవాలని సమ్మెను విరమింప చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. సమగ్ర శిక్షలో కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, పే స్కేల్ ఇవ్వాలని కోరుతూ గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారన్నారు. జిల్లాస్థాయిలో ఏపీఓ, సిస్టమ్ అనలిస్ట్, టెక్నికల్ పర్సన్లు, ఆపరేటర్లు, డిఎంఎంటి మెసెంజర్లు, మండల స్థాయిలో ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు,ఐఈఆర్పీఎస్, మెసెంజర్లు, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో సిఆర్పిలుగా, పాఠశాల స్థాయిలో పార్ట్ టైం ఇన్స్క్టర్లు(ఆర్ట్, పిఈటీ, వర్క్ ఎడ్యుకేషన్)గా కేజీవీబీ యూఆర్ యస్ లలో, స్పెషల్ ఆఫీసర్లు పీజీసీ ఆర్టీలు ,సీఆర్టీలు,పిఈటీలు, ఏఎన్ఎం, అకౌంటెంట్లు,క్రాఫ్ట్, కంప్యూటర్ ఇన్స్పెక్టర్లు,కుక్ వాచ్ ఉమన్లు, స్వీపర్లు, స్కావెంజర్లు,18 ఏండ్లుగా అతి తక్కువ వేతనాలకే పని చేస్తున్నారన్నారు. ఏండ్లు గడుస్తున్న ఒకే వేతనం తప్ప పెరుగుతున్న నిత్యవసరాలు అనుగుణంగా వేతనం పెంచడం లేదని అన్నారు. కనీసం ఆరోగ్య కార్డులు, మహిళలకు ప్రస్తుతి సెలవులు, జీవిత బీమా చనిపోయిన ఉద్యోగ కుటుంబాలకు ఎక్సగ్రేషయా, అర్హులైన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగం వంటి చట్టబద్ధ సౌకర్యాలు అమలు కావడం లేదన్నారు. వారంతా ఆర్థికంగా ,సామాజికంగా వెనుకబడిన వర్గాలకి చెందిన వారన్నారు.ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వారి సమస్యలు పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారూ అన్నారు. ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించకపోవడంతో నిరవధిక సమ్మెకు పోనుకున్నారని అన్నారు. సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించి వారిని రెగ్యులరైజ్ చేయాలని, పే స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.బీమా సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 25 లక్షలు ఇవ్వాలని , ప్రభుత్వ నియమాకాలో వెయిటేజ్ కల్పించాలని కోరారు.రిఎంగేజ్ విధానాన్ని రద్దు చేయాలని ఇతర న్యాయమైన సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలన్నారు ప్రభుత్వాని కోరారు.

Exit mobile version