* కార్మికులకు కనీస వేతనం ఉద్యోగ భద్రత అమలు చేయాలి* *సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్*
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జమ్మికుంట మండల నాలుగో మహాసభలు జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో నిర్వహించారు ఈ మహాసభలకు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ పాల్గొని మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఉద్యోగ భద్రత కనీస వేతనం అమలు చేసేంతవరకు పోరాడుతామని తెలిపారు గత అనేక సంవత్సరాలుగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాల కోసం అనేక పోరాటాలు నిర్వహిస్తున్న ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రానున్న రోజుల్లో మండల స్థాయిలో సంఘాలను బలోపేతం చేసుకుని భవిష్యత్తు ఆందోళన పోరాటాలను చేస్తామని తెలిపారు ఈ మహాసభలలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు రాము, అమాలి సంఘం మండల అధ్యక్షులు జక్కుల రమేష్ యాదవ్, పట్టణ కార్యదర్శి దండిగారి సతీష్, జిపి యూనియన్ జిల్లా అధ్యక్షులు రాచర్ల మల్లేశం, నాయకులు ఏ సారయ్య, రవీందర్రావు, శనిగరపు కొమరయ్య, పెరుగు అశోక్, మహంకాళి కొమురయ్య, జిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.