*అంతర్జాతీయ మహిళా దినోత్సవం జయప్రదం చేయండి*
*సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్*
*జమ్మికుంట మార్చి 3 ప్రశ్న ఆయుధం*
20వ శతాబ్దం ప్రారంభంలో క్రూరమైన దోపిడీ అమానవీయ పరిస్థితులకు సామ్రాజ్యవాద యుద్దాలకు వ్యతిరేకంగా తమకు ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ తో మహిళ కార్మికులు చేసిన పోరాటాల ఫలితంగా మనం ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం జరుపుకుంటున్నమన్నారు. జర్మన్ విప్లకారిని క్లారా జట్కిన్ ప్రతిపాదన ప్రకారం ఆగస్టు 1910 డెన్మార్క్ లో అంతర్జాతీయ సోషలిస్ట్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ లో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని నిర్ణయించారని తెలిపారు 1975లో ఐక్యరాజ్యసమితి దీనిని అధికారి యొక్క గుర్తించడంతో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ జరుపుకోవడం జరుగుతుందని మహిళలకు సమానత్వం, న్యాయం, దోపిడీ వివక్ష హింస లేని జీవితం లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని Iభారతదేశంలో దాదాపు 70 శాతం మహిళలు నిరుద్యోగులు ప్రమాదకరమైన స్వభావం కలిగిన పనుల్లో ఎక్కువగా పని చేస్తున్నారని దీనితోపాటు ఎటువంటి వేతనాలు చెల్లించని పనుల్లో మహిళల వాటా పెరుగుతుందని అంగన్వాడి, ఆశా, మధ్యాహ్న భోజనం, జాతీయ ఆరోగ్య మిషన్ మొదలైన కేంద్ర పథకాలలో పనిచేసే కార్మికులు అత్యధికలు మహిళలే వీరిని బిజెపి ప్రభుత్వం గుర్తించలేదని. కనీస వేతనాలు అమలు చేయడం లేదని గౌరవ వేతనం, పారితోశికం గల పేరుతో శ్రమదోపిడి చేస్తుందని ముఖ్యంగా ఆశా కార్మికులకు చట్టబద్ధమైన హక్కులపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా అమలు చేయడం లేదని. భారతీయ మహిళలో 40% మంది పిల్లలు వృద్దుల సంరక్షణ లేదని జీతభత్యంలోని రోజుకు ఆరు గంటలు వెచ్చిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయన్నారు జిడిపిలో మహిళ కుటుంబాల పని విలువ సంవత్సరానికి 22 లక్షల కోట్లుగా మహిళలు చేస్తున్న పనిని ప్రభుత్వం గుర్తించాలని సిఐటియు చాలా కాలం నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నదని అశ వర్కర్స్ ని కార్మికులుగా ఉద్యోగుల గుర్తించి రెగ్యులర్ చేయాలని 15వ ఐ ఎల్ సి యొక్క సిఫారసుల ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలి. మహిళా కార్మికులందరికీ ప్రసూతి సెలవులు,ప్రసవ సౌకర్యాలు, నర్సింగ్ విరామాలు కల్పించాలని పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నివేదిక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కార్యాలయంలో మహిళలకు భద్రత కల్పించి సురక్షితమైన ప్రయాణ ఏర్పాటు చేయాలని, మహిళలు తో రాత్రి వేళలో పని చేయించకూడదని డిమాండ్లతో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నము కాబట్టి దీనికి పెద్ద ఎత్తున జిల్లాలోని ఆశా కార్మిక వర్గం హాజరై విజయవంతం చేయాలని కోరారు.*
*ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మారెళ్ళ శ్రీలత సిఐటియు నాయకులు చెల్పూరి రాము, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు సుజాత, స్వప్న, కవిత, కోమల, తదితరులు పాల్గొన్నారు.*