Site icon PRASHNA AYUDHAM

ఈనెల మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నోటీసును కమిషనర్ ఇస్తున్న సిఐటియు నాయకులు 

IMG 20250503 WA0018

ఈనెల మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నోటీసును కమిషనర్ ఇస్తున్న సిఐటియు నాయకులు

కామారెడ్డి ఇ నెల 20 న జరిగే దేశవ్యాప్త సమ్మెలో తాము పాల్గొంటున్నామంటూ కామారెడ్డి మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కు శనివారం నోటీసును అందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు కందరపు రాజనర్సు మాట్లాడుతూ సర్వతిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బిజెపి కార్పొరేట్ మతోన్మాద విధానం వ్యతిరేకంగా కార్మికులు సమ్మెలో పాల్గొనాలని, నాలుగు లేబర్ కోడ్స్ ను అమలు చేయద్దు అని కార్మికులకు బానిసలుగా మార్చొద్దు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితం పెట్టుబడిదారుల కార్పొరేట్ సంస్థల ప్రయోజనం కోసం పార్లమెంట్లో లేబర్ కోడ్స్ ను ఆమోదించుకున్నదనీ, దేశ కార్మిక వర్గం వాటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సర్వతిక సమ్మెతో పాటు అనేక ఆందోళనలు పోరాటంతో వాటిని ప్రతిబించడంతో లేబర్ కోడ్స్ లను అమలు చేయలేకపోయిందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ తగ్గినప్పటికీ తన మిత్రపక్షల అండతో మూడోసారి అధికారులోకి వచ్చిన మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్పొరేట్ మిత్రుల కోసం కార్మిక వర్గం సాధించుకున్న కార్మిక హక్కులను హరిస్తున్నదన్నారు. దేశ సంపదలను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి కార్పొరేట్ మతోన్మాద ఎజెండను అమలు చేస్తున్నదన్నారు. న్యాయపద్యంలో లేబర్ కోడ్ అమలను కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక 2025 మే 20 న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిందన్నారు. మే 20 న జరిగే సమ్మెకు తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంలో నిర్లక్ష్యంగా ఉన్నాయన్నారు. సామాజిక భద్రత చట్టం ప్రకారం ఏ ఉద్యోగి కార్మికులైన వైద్య సదిపాయం, ప్రమాద బీమా, ఈఎస్ఐ, గ్రాడివిటీ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్రసూతి ప్రయోజనం లాంటి సదుపాయాలు కల్పించాలన్నారు. కార్మికులకు కొంత మేరకైన రక్షణ కల్పిస్తున్న ఈ 29 చట్టాలను మోడీ ప్రభుత్వం సులభతర వ్యాపారం పేరుతో వాటిని రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ కు ప్రయత్నిస్తుందనీ, మున్సిపల్ కార్మికులను పర్మిట్ చేయాలని, రెండో పిఆర్సిలో కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆందోళన పోరాటం నిర్వహించి సమ్మెకు సిద్ధం కాబోతున్న సమయంలో మోడీ ప్రభుత్వం వేతన చెల్లింపు చట్టం, కనీస వేతన చట్టం బోనస్ చెల్లింపు సమాన పనికి సమాన వేతనం చట్టాల్లోని సారానంత తీసివేసి వేతనాలకోడు 2019 చట్టాన్ని తీసుకురావడం కార్మిక వర్గానికి నష్టం చేయడమే కార్మికుని అవసరాన్ని ప్రతిపాదన కనసవేత్తనం నిర్ణయించాలన్నారు. 15000 లోపు వేతనం పొందేవారు సంక్షేమ పథకాలకు అర్హులుగా ఆ పైన వేతనం పొంది వారిని అనరుగా నిర్ణయించింది పథకానికి ప్రభుత్వం యాజమాన్యం చెల్లించేవాడు తగ్గించి ఈ పథకాల బాధ్యత నుండి వైదొలగడానికి అనుమతించింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనిస వేతనం సమాన పనికి సమాన వేతనం చెల్లించని చెబుతున్నప్పటికీ ఆ అంశాన్ని గాలికి వదిలేస్తుందనీ, ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ ప్రకారం రోజుకు ఒకవేల 176 నెలకు 4,57 రూపాయల వేతనాన్ని మోడీ ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గం అని, పైగా వేతనతో కూడిన సెలవులు పండుగ సెలవులు వేతనాలు చెల్లించే విధానాన్ని పోరాడ సాధించుకున్న ఎనిమిది గంటలకు పని దినాలను మినయించింది సాధించుకున్న12గo. గంటలకు అమలు చేయాలని చూస్తున్నదన్నారు. మున్సిపల్ కార్మికుల పర్మెంటు పనికి భద్రత కనీస వేతనాలు అమలు అవుతాయని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న కార్మికుల ఆశలను మోడీ ప్రభుత్వం స్పష్టంగా సమాధి కట్టిందనీ, కార్మికుల హక్కుల చట్టం 1947 ప్రకారం సమ్మెకు సమ్మె చేయడం అసంఘటితం కావడం సమిష్టిదార ఆకులను కాలు రాస్తున్నదన్నారు. గతంలో సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత 42 రోజుల రోజులకు ముందుగా సమ్మెకు వెళ్లే హక్కు ఉంది, దానిని 60 రోజులు ముందు సమ్మెకు వెళ్లే నిబంధనలు చేర్చి అవకాశం కల్పించింది కార్మిక సంఘాల నాయకత్వం పైన ఉద్దేశపూర్వక కేసులు పెట్టి శిక్ష 20.000 నుండి 50.000 వరకు జరిమానా విధించేందుకు సిద్ధమైందన్నారు. సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే ప్రతినిధి హక్కుల పైన మోడీ ప్రభుత్వం దాడి చేస్తున్నదన్నారు. కాంటాక్ట్ విధానం రద్దుచేసి ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మిట్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, 8 గంటలు పని చేయడానికి అమలు చేయాలి బోనస్, ఈఎస్ఐ చట్టాలతో వేతన సీలింగ్ పెంచాలన్నారు. తెలంగాణ రాష్ట్ర రెండో పియర్స్ లో కలిసివేతం 26 వేలుగా నిర్ణయించాలి, మున్సిపల్ శాఖలోని వివిధ భాగాలు పనిచేస్తున్న వారి చదువు, వృత్తి సీనియారిటీని గుర్తించి జవాన్లుగా, డ్రైవర్లుగా, సానిటరీ ఇన్స్పెక్టర్గా, కంప్యూటర్ ఆపరేటర్ గా మొదటి ప్రాధాన్య తెచ్చి ప్రమోషన్ కల్పించాలన్నారు. కార్మికులు మరణిస్తే మట్టి ఖర్చులు నిమిత్తం 30000 ఇవ్వాలి, కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, మున్సిపల్ కార్మికులందరికీ డబల్ బెడ్ రూములు, ఇళ్ల స్థలాలు కేటాయించాలి, పెరుగుతున్న పట్టణ విస్తరణ అనుగుణంగా కొత్త సిబ్బంది నియమించాలి, కామరెడ్డి మున్సిపల్ లో గత ఆరు నెలల నుంచి పని చేస్తున్న కార్మికుల జీతాలు చెల్లించాలనీ వారిని తిరిగి డ్యూటీలోకి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎండి మహబూబ్ అలీ, నాయకులు పోతారం ప్రభాకర్, ప్రభు, శివరాజవ్వ, బొకే జ్యోతి, భాస్కర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version