మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయలీ   – సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  పాలడుగు భాస్కర్

మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయలీ

– సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

పాలడుగు భాస్కర్

– కామారెడ్డి

బిజెపి రైతు కార్మికుల వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రూటరీ క్లబ్ లో సిఐటియు తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం భారతదేశంలో ఉన్న ఈ దేశ ప్రజల ఆస్తులు అయినటువంటి రైల్వే, ఎల్ఐసి, ఓడరేవులు, విమానయాన సంస్థలు, రక్షణ రంగం మొత్తం 52 సంస్థలను ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మోడీ ప్రైవేట్ పరం చేశాడు అని విమర్శించారు. వీటన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి భారతదేశంలో ఉన్న రైతులు, కార్మికులు, మెజార్టీ ప్రజలుగాఉన్న వీరికి వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడులను తీసుకొచ్చాడని, ఈ లేబర్ కోడుల ద్వారా ఈ దేశంలో ఉన్న రైతులు, కార్మికులకు హక్కులు అడిగే హక్కును, స్వతంత్రన్నీ కోల్పోతారని, కార్మికుల హక్కుల కోసం గానీ రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధరల కోసం గాని కనీసం రోడ్డెక్కి ప్రశ్నించే పరిస్థితి ఉండదు అన్నారు. ఈ విధానాల వల్ల ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదకరంలో ఉందని ఒక్క మాటలో చెప్పాలంటే బిజెపి, ఆర్ ఎస్ స్ రాజరిక పాలన, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదని అందుకే ఈ దేశ సంపదను ఈ దేశ ప్రజలకు సంబంధం లేకుండా పెట్టుబడుదారులకు కట్టబెట్టడానికి లేబర్ కోడులను అమలు చేస్తున్నాడు అన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సీఐటీయూ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20న జరిగే సార్వత్రిక సమ్మెను రైతులు కార్మికులు కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం పిలుపునిచ్చారు. ఈ లేబర్ కోడుల ద్వారా ఈ దేశంలో రైతుబండించిన టమాటాను ఈ దేశ ప్రజలే కొనే పరిస్థితి ఉండదన్నారు. కార్మికులు కూలి చేసి కూలి ఇవ్వు అని అడిగే పరిస్థితి ఉండదని ఇంతటి ప్రమాదకరమైన చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ సమ్మె ను నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం మున్సిపల్ యూనియన్ రాష్ట్ర నాయకులు పాలడుగు సుధాకర్ మోడీకి ఈ దేశ రైతులు కార్మికుల పట్ల ప్రేమ లేదని కులం పేరా మతం పేరా దేశ ప్రజలను విచ్ఛిన్నం చేసే కుట్ర తప్ప వేరే ఆలోచన లేదని విమర్శించారు.

సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతీరామ్ నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు లు మాట్లాడుతూ ఈ దేశ ప్రజలకు నష్టం కలిగించే లేబర్ కోడులను వ్యతిరేకిస్తూ జరిగే ఈ సమ్మెను కామారెడ్డి జిల్లా కేంద్రంలో 2000 మందితో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, వివిధ రకాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now