Site icon PRASHNA AYUDHAM

సిఐటియు శిక్షణ తరగతులు…

IMG 20240724 WA1495

సిఐటియు జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి*

సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లూరి ఆంజనేయులు...

ప్రశ్న ఆయుధం 24జులై యాదాద్రి :
ఈనెల జూలై 27, 28 తేదీలలో రామన్నపేట పట్టణ కేంద్రంలోని MLNS ఫంక్షన్ హాల్ లో జరిగే సిఐటియు రాజకీయ శిక్షణా తరగతులు జయప్రదం చేయాలని *సిఐటియు *జిల్లా కమిటీ సభ్యులు కొల్లూరి ఆంజనేయులు తెలిపారు
గురువారం రోజున మోట కొండూరు మండల కేంద్రంలో సిఐటియు రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కరపత్రం విడుదల చేయడం జరిగింది
అనంతరం ఏర్పాటు చేసిన కార్మికుల సమావేశంలోపాల్గొని మాట్లాడుతూ నేడు దేశంలో కార్మిక వర్గం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నది వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం లేదు ప్రభుత్వాలు రోజురోజుకు నిత్యవసర ధరలు పెంచుతూ కార్మికులను మరింత ఆర్థిక ఇబ్బందులకు నెట్టివేస్తున్నారు కార్మికులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు కార్మికులకు నష్టం చేసే విధానాలు అవలంబిస్తున్నాయి విమర్శించారు దేశ స్వతంత్రానికి పూర్వం నుండి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది శాస్త్ర. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న తరుణంలో ఎనిమిది గంటల కార్మిక పని సమయాన్ని తగ్గించాల్సింది పోయి 12 గంటలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నూతన లేబర్ కోడులను తీసుకొచ్చింది కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం ప్రశ్నార్దికంగా చేస్తున్నది జిల్లాలో పరిశ్రమలు ఉన్నప్పటికీ స్థానికులకు ఉపాధి నామాత్రంగానే ఉన్నది స్వయం ఉపాధితో బతుకుతున్న కార్మికులను ప్రభుత్వాలు ఆదుకోవాలని అన్నారు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహించడంలో సిఐటియు ముందుండి పనిచేస్తుందని అన్నారు ఇంకా అనేక సమస్యలు చాలా పెండింగ్ ఉన్నటువంటి సమస్యల పైన సిఐటియు రాజకీయ శిక్షణ తరగతులలో సంఘటిత అసంఘటిత కార్మికులు జయప్రదం చేయడం కోసం కార్మిక వర్గం పాల్గొని ఈ రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో మోటకొండూరు మండల గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్
మండల ఇన్చార్జి *గోసంగి పరమేష్ భోగారం వీరస్వామి
హమాలి సంఘం నాయకులు తొండల సతీష్ మండలనాయకులు అమ్మనబోలు పాండు వంగపల్లి దయాకర్ ఆడేపు శ్రీధర్ వెంకటయ్య బోట్ల లక్ష్మీనరసింహ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

Exit mobile version