సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): రామచంద్రపురం డివిజన్ పరిధిలో రానున్న గణపతి నవరాత్రుల ఏర్పాట్లు, గణపతి నిమర్జనం కొరకు అందుబాటులో ఉన్న రామచంద్రపురం రాయ సముద్రం చెరువు, చెరువుకు వెళ్లే దారులను హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్ పుష్ప నగేష్, స్థానిక జీహెచ్ఎంసీ డీసీ సురేష్, ఎస్ఎస్ వెంకటేశ్వర్లు, లా అండ్ ఆర్డర్ సీఐ జగన్నాథ్, ఎస్ఐ శశికాంత్ రెడ్డి, ఇరిగేషన్, ఎంతమాలోజి, అన్ని విభాగాల ఉన్నత అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్ పుష్ప నగేష్ లు మాట్లాడుతూ.. చెరువులో ఉన్న గుర్రపు డెక్క తొలగించాలని, అలాగే చెరువు చుట్టూ బ్యారికేడ్స్ పెట్టాలని, విద్యుత్ దీపాల అలంకరణ ఎక్కువగా ఉండాలని, చెరువుకట్ట రోడ్ ఇరువైపులా పిచ్చిమొక్కలు రోడ్ పైకి వచ్చాయని, శుభ్రం చేయించాలని సూచించారు. రోజురోజుకు నిమర్జనల అనంతరం కోనేరులో నీరు మార్చి, గణపతిలను ఇతర సామాగ్రి తొలగించాలని, క్రేన్ లు 13 రోజుల వరకు అందుబాటులో ఉండాలని తెలిపారు. అన్ని విభాగాల అధికారులు దృష్టి సారించి ఎవరికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. అలాగే స్థానిక ఓల్డ్ ఆర్సిపురం, రామచంద్రారెడ్డి నగర్ కాలనీ వాసులతో కాసేపు మేయర్ విజయలక్ష్మి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
రామచంద్రపురంలో పర్యటించిన నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి
Published On: August 29, 2024 5:57 pm
