- ఎస్సైతో పాటుగా పలువురిపై సివిల్, క్రిమినల్ డిపమేషన్ కేసులు దాఖల
తప్పుడు కేసులు పెట్టి తీవ్రమనోవేదనతోపాటు డబ్బు, సంఘంలో తమ గౌరవ మర్యాదలకు నష్టం కలిగించిన ఎస్సై ఓంకార్ యాదవ్, గ్రానైట్ వ్యాపారి ఓం నారాయణ ఖండేల్వాల్పై రూ.కోటికి ఖమ్మం కోర్టులో బాధితులు సివిల్, క్రిమినల్ పరువు నష్టం కేసులు దాఖలు చేశారు. వివరాల ప్రకారం.. 2006కు ముందు తిరుమలాయపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలోని 2.33 ఎకరాల భూమిని మద్దినేని శ్రావణ్కుమార్కు తన తాత రంగయ్య గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. శ్రావణ్ పేరుపై పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలని తిరుమలాయపాలెం ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకున్నారు.
ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ గ్రానైట్, మార్బుల్స్ వ్యాపారి ఓం నారాయణ ఖండేల్వాల్ సదరు భూమి కౌలుదారు కాంపాటి వెంకటేశ్వర్లుతో కుమ్మక్కై అక్రమ మార్గంలో కౌలుదారు పేరుపై పాసు పుస్తకం పొందారు. సదరు పాసు పుస్తకాన్ని రద్దు చేయాలని బాధితులు ఖమ్మం ఆర్డీఓ వద్ద అప్పీలు, కోర్టులో డిక్లరేషన్ దావా దాఖలు చేశారు. 2012లో తిరుమలాయపాలెం ఎమ్మార్వో కార్యాలయం సిబ్బందితో కలిసి రికార్డులు ట్యాంపరింగ్ చేసి పాసు పుస్తకం పొందడంతో ఖండేల్వాల్, వెంకటేశ్వర్లు తో పాటు రెవెన్యూ సిబ్బందిపై క్రిమినల్ కేసు నమోదైంది.అనంతరం ఆర్టీఓ కోర్టు స్థానిక ఎమ్మార్వో తీరును
తప్పుబడుతూ వారిద్దరికి జారీ అయిన పాసు
పుస్తకాలను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. ఖమ్మం
సీనియర్ సివిల్ జడ్జి కోర్టు సైతం సదరు పాసు
పుస్తకాలు రద్దు చేసి శ్రావణ్ కుమార్ పేరుపై భూమిని నమోదు చేసి పాసు పుస్తకాలు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై అక్రమార్కులు జిల్లా కోర్టులో అప్పీలు దాఖలు
చేయగా కింది కోర్టు తీర్పు సరైనదేనని పేర్కొంటూ
డిస్మిస్ చేశారు. హైకోర్టులోనూ వారికి అదే పరిస్థితి ఎదురైంది. సుప్రీం కోర్టులోనూ వారి అప్పీలును
కొట్టేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వారు అప్పటి
తిరుమలాయపాలెం ఎస్పై ఓంకార్ యాదవ్ కుమ్మక్కై శ్రావణ్ కుమార్ అతడి తండ్రి వెంకటేశ్వర్లుపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. శ్రావన్ ను ఉన్నత చదువుల కోసం విదేశాలకు
వెళ్లకుండా చేశారు.
ప్రైవేటు ఉద్యోగాలు చేసుకోనివ్వకుండా మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. చివరికి వారు నమోదు చేసిన క్రిమినల్ కేసును కూడా కోర్టు కొట్టేసింది. దాదాపు పదేళ్లకు పైగా శ్రావణ్ కుమార్, తన తండ్రి వెంకటేశ్వర్లును అన్ని విధాలా నష్టపరచడం తో పాటు సంఘంలో గౌరవ మర్యాదలకు భంగం కలిగించారని పేర్కొంటూ గ్రానైట్ వ్యాపారి ఓం నారాయణ ఖండేల్వాల్, ఎస్సై ఓంకార్ యాదవ్లపై రూ. కోటికి ఖమ్మం జిల్లా కోర్టులో సివిల్ డిఫమేషన్ కేసు దాఖలు చేశారు. అదేవిధంగా ఈ ఇద్దరిపై ఖమ్మం ప్రిన్సిపల్ జేఎఫ్సీఎం కోర్టులో క్రిమినల్ డిపమేషన్ కేసు దాఖలు చేశారు. పిటీషనర్ల తరపున న్యాయవాదులు కిలారు లక్ష్మీనర్సింహారావు, గొల్లపూడి రామారావు వాదిస్తున్నారు…