*రేపటి నుంచి దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్!*
*హైదరాబాద్:మే 06*
పహల్గామ్ ఘటనతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి అయితే భారత్,పాక్ సరిహద్దుల్లో ఉదృత్తతలు నెలకొన్నవేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు ఇచ్చింది, అయితే ఈ క్రమంలో సివిల్ మాక్ డ్రిల్ చేపట్టాలని సూచించింది..
రేపు జరగబోయే మార్క్ డ్రిల్ అనుసరించవలసిన దశలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలిపింది భారతదేశం పాకిస్తాన్ పై కఠిన నిర్ణయాలను తీసుకుంటుంది. దీంతో భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తుందనే కథనాల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
శత్రు దాడి జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ప్రజల భద్రతను నిర్ధారిం చేలా ఈ నెల 7వ తేదీన మాక్ డ్రిల్స్ నిర్వహించాలని తెలిపింది. మాక్ డ్రిల్ సమయంలో వైమాణిక దాడి చేసేటప్పుడు వార్నింగ్ ఇచ్చేలా సైరన్ మోగించడం, దాడుల సమయంలో తమను తాము రక్షించుకోవడానికి పౌరులు, విద్యార్థులు మొదలైన వారికి శిక్షణ ఇవ్వడం లాంటివి ఉన్నాయి.
అయితే ఈ మాక్ డ్రిల్ రేపు దేశవ్యాప్తంగా ఉన్న 259 జిల్లాల్లో నిర్వహించను న్నారు. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల అధికారులతో ఈ రోజు కేంద్ర హోమ్ శాఖ కీలక సమావేశం నిర్వ హించింది.
దీనికి రాష్ట్రాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ రేపటి మాక్ డ్రిల్ గురించి అధికారులతో చర్చించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర అధికారులకు కేంద్రం ప్రత్యేక చర్చలు జరపడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాం శంగా మారిపోయింది.
దీంతో భారత్ ఏ క్షణమైన పాకిస్తాన్ పై యుద్ధం ప్రారంభించే అవకాశం ఉందనే చర్యలు జోరందు కున్నాయి. మరోపక్క పాకిస్తాన్ సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలను ఆపడం లేదు. నిత్యం కాల్పుల విరమణ చట్టాన్ని అతిక్రమిస్తూ..
భారత ఆర్మీపై ఫైరింగ్ చేస్తునే ఉన్నారు. ఈ క్రమంలో భారత్ వారికి దీటైన సమాధానం చెప్పేం దుకు సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి.