నాలుగవ రోజుకు చేరిన సివిల్ సప్లై హమాలీల సమ్మె.. – అంబేద్కర్ కు వినతి పత్రం ఇచ్చిన హమాలీలు 

నాలుగవ రోజుకు చేరిన సివిల్ సప్లై హమాలీల సమ్మె..

– అంబేద్కర్ కు వినతి పత్రం ఇచ్చిన హమాలీలు

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సివిల్ సప్లై హమాలీలు (ఏఐటీయూసీ) చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 4 వ రోజుకు చేరుకుంది. హమాలీలు కామారెడ్డి ఆర్డిఓ కార్యాలయం నుండి తమ సమస్యలు పరిష్కరించాలని ర్యాలీగా బయలుదేరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అంబేద్కర్ విగ్రహం నిక్వి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి బాలరాజు మాట్లాడుతూ ఎగుమతి దిగుమతి రేట్లు 29 రూపాయలు ఇవ్వాలని గత అక్టోబర్ లో 18 వ తారీఖున సివిల్ సప్లై రాష్ట్ర కమిషనర్ చౌహాన్ కు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. సమస్యల పరిష్కరిస్తామని ఆమె ఇవ్వడం జరిగిందనీ, అయినా గత మూడు సంవత్సరాలుగా 26 నుండి 29 రూపాయలు పెంచవలసిన ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వము మర్చిపోయిందన్నారు. హమాలీలకు కనీస జీవో అమలు చేస్తూ ఎగుమతి దిగుమతి రేట్లు పెంచాలని, ఈఎస్ఐ సౌకర్యం, పెన్షన్, ప్రమాదవశాత్తు మరణిస్తే కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 18న రాష్ట్ర కార్యాలయమును ముట్టడించిన రాష్ట్ర ప్రభుత్వ స్పందించకపోవడం కార్మికుల పట్ల ప్రేమ లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా జిల్లా ఇన్చార్జి మంత్రి, సివిల్ సప్లై రాష్ట్ర అధికారులు స్పందించి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ ర్యాలీగా ఆర్డిఓ కార్యాలయం నుండి స్టేషన్ రోడ్డు మీదుగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు .ఎల్. దశరథ్, సివిల్ సప్లై హమాలీ నాయకులు బీరయ్య, కృష్ణ, గంగరాజు, బాజీ, సంపత్, మహేష్, ఎల్లేశం, ప్రవీణ్, కే సాయిలు, రాజశేఖర్, ప్రసాద్, బాలమల్లు, భీమయ్య, పద్మ, శ్రీకాంత్, లింబాద్రి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now