Headlines
-
సికేఎం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళన
-
బిడ్డ మృతికి కారణం వైద్యుల తప్పిదం అని ఆరోపణ
-
సకాలంలో ఆపరేషన్ చేస్తే మృతి తప్పేదని బంధువుల గోడు
-
సికేఎం ఆసుపత్రి ఘటన: న్యాయం కోసం బాధితుల డిమాండ్
-
ఉమ్మనీరు మింగిన బిడ్డ: వైద్య సేవలపై నిలదీత
సికేఎం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తన కుమారుడు మృతి చెందాడంటూ బంధువులు ఆందోళన దిగిన ఘటన వరంగల్లో చోటుచేసుకుంది. జిల్లాలోని గీసుకొండ మండలం కొమ్మాల గ్రామ గోపియా తండాకు చెందిన సంధ్య రాజేందర్ దంపతులు ప్రసవం కోసం ఈనెల 7వ తేదీన సీఎం ఆస్పత్రి వచ్చారు. సాయంత్రం సంధ్య కు మగ బిడ్డ జన్మించగా బాబు ఉమ్మనీరు మింగాడు అని సికేం వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రి తరలించారు.
చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందాడు. సి కె ఎం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తన కుమారుడు మృతి చెందాడని సకాలంలో సిజేరియన్ ఆపరేషన్ చేస్తే ఉమ్మనీరు మింగేవాడు కాదని తన కుమారుడి మృతికి సీకేఎం వైద్యులే కారణమంటూ తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.