Site icon PRASHNA AYUDHAM

మొదటి రాష్ట్రంగా తెలంగాణలో వర్గీకరణ ..

 

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు అనుకూలంగా అసెంబ్లీలో మాట్లాడి దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి మాదిగ జాతి హృదయాన్ని ఆకట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతి రుణం తీర్చుకునే సందర్భం వచ్చినందున.ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్  నివాసంలో సమావేశం కావడం జరిగింది.తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జనాభా దామాషా ప్రకారం జరగాలి. మాదిగలకు న్యాయం జరగాలి. కానీ మాదిగలకు మాదిగ ఉప కులాలు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది.దీనికి అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ నేతృత్వంలో ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్. ఏ సంపత్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే.సతీష్ మాదిగ , ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక సభ్యులు. చారకొండ వెంకటేష్, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారుడు. తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version