డీఎస్సీ నియామకాల్లో వర్గీకరణ అమలు చేయాలి..
కామారెడ్డి జిల్లా డీఎస్సీ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల..
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కి వినతి పత్రం
సుప్రీం కోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలు పై సానుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీ సాక్షిగా ఇదివరకే ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ల లో కూడా వర్గీకరణ అమలు చేసి నియామకాలు చేపడతాం,అవసరమైతే ఆర్డినెన్సు కూడా తీసుకువస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం కామారెడ్డి జిల్లా డీఎస్సీ ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబేట్టుకోవాలని,ఈ డీఎస్సీ నియామకాల్లో వర్గీకరణ అమలు చేసి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది…..