*వ్యాధులకు స్వస్తి పలకాలంటే పరిసరాల పరిశుభ్రతగా ఉండాలి*
*డాక్టర్లు హిమబిందు, సంధ్య*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 12*
వ్యాధులకు స్వస్తి పలకాలంటే పరిసరాలు పరిశుభ్రతగా ఉండాలని డాక్టర్లు హిమబిందు సంధ్య అన్నారు.వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గురువారం జమ్మికుంట మండలంలోని మడిపల్లి చింతలపల్లి గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహించారు చింతలపల్లి గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఆరోగ్య సమస్యలు ఉన్న 29 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు 3గురు జ్వర పీడితులను గుర్తించి వారి రక్త పూతల నమూనాలను సేకరించి వైద్య పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపించడం జరిగిందని మరో ముగ్గురికి ఆర్ డీ టి కిట్స్ ద్వారా డెంగీ మలేరియా వ్యాధి పరీక్షలు చేశారు.అదే విధంగా మడిపల్లి గ్రామoలో డాక్టర్ సంధ్య ఉచిత వైద్య శిబిరం నిర్వహించి 48 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. జ్వరం ఉన్న 4 గురికి రక్త పూతల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపించడం జరిగిందని ఒకరికి ఆర్ డీ టి కిట్ ద్వారా మలేరియా డెంగీ పరీక్షలు చేశారు. గ్రామస్తులకు సీజనల్ వ్యాధులపై అవగహన కల్పించారు వ్యక్తి గత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలకు తెలియజేశారు డ్రై డే కార్యక్రమము ద్వారా నీటీ నిల్వలలో ఉన్న దోమల లార్వా లను నిర్ములించి దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలన్నారుఈ కార్యక్రమoలో హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి సూపర్ వైజర్ సదానందం ఏఎన్ఎం లు రజిత వనజ సంధ్యారాణి ఆశాకార్యకర్తలు ఇందిర, రమ సునీత కోమల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.