నిజాంపూర్(కె)పాఠశాలలో పరిశుభ్రత దినం

సంగారెడ్డి/సదాశివపేట, సెప్టెంబరు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్వచ్చతా పాక్వడా కార్యక్రమంలో భాగంగా బుధవారం సదాశివపేట మండలం నిజాంపూర్ (కె) పాఠశాలలో విద్యార్ధులకు ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ, ఉపాధ్యాయులు నవనీత, సునీత వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరించారు. పరిశుభ్రత కోసం విద్యార్థులను ప్రేరేపించడానికి ఆడియో విజువల్ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు గోళ్లను కత్తిరించడం, శుభ్రంగా ఉంచుకోవడం, ప్రతి రోజూ శుభ్రమైన నీటితో స్నానం చేయడం, శుభ్రమైన దుస్తులు ధరించడం, బహిరంగంగా ఉమ్మివేయకుండుట, బూట్లు / చెప్పులు ధరించడం మొదలైన వాటి గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఇతరులతో వ్యక్తిగత వస్తువులు పంచుకోకూడదని తెలిపారు. విద్యార్థులకు మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. రోజూ రెండుసార్లు పళ్ళు తోముకోవడం అలవాటు చేసుకోవడం ద్వారా విద్యార్థులకు దాని ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణతో పాటు ఉపాధ్యాయులు నవనీత, సునీత, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now