*పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత-మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 27*
పచ్చదనం,పరిశుభ్రత మనందరి బాధ్యత, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా వుంచుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు సూచించారు.స్వచ్చత హి సేవా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలోని పార్క్ లోని సిబ్బందితో కలిసి చైర్మెన్ పరిసరాలను శుభ్రం చేశారు అనంతరం ఛైర్మన్ మాట్లాడుతూ ఇల్లు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి సూచించారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ ఎం డీ అయాజ్,మేనేజర్ జీ రాజిరెడ్డి,ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్ హెల్త్ అసిస్టెంట్ మహేష్,శ్రీనివాస్ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.