కామారెడ్డి డిగ్రీ కళాశాలలో క్లైమేట్ స్మార్ట్ గ్రీన్ క్యాంపస్ క్లబ్
ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగష్టు 14, కామారెడ్డి :
ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల కామారెడ్డి నందు వృక్షశాస్త్ర విభాగము & ఫారెస్ట్రీ విభాగాల ఆధ్వర్యంలో క్లైమేట్ స్మార్ట్ గ్రీన్ క్యాంపస్ క్లబ్ ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయ్ కుమార్, వృక్ష శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ దినకర్ లు ప్రారంభించారు.
హైదరాబాదులోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేయబడిన “క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్” అంశంపై మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ దినకర్ వాతావరణంలో జరిగే మార్పులు, వాటి ప్రభావం, ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టి, ల్యాండ్ స్లైడింగ్, భూకంపాలు వంటి పర్యావరణంలో ఆకస్మికంగా జరిగే హానికర ప్రమాదాలు, పర్యావరణానికి హాని కలగకుండా చేపట్టే చర్యలు వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి పర్యావరణాన్ని కాపాడుటకే క్లైమేట్స్ స్మార్ట్ గ్రీన్ క్యాంపస్ క్లబ్ మన ప్రభుత్వ కళాశాలలొ స్థాపించబడిందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కళాశాల పరిధిలో చేపడుతూ విద్యార్థులు సర్వ సమాజాన్ని చైతన్య పరచాలని, ప్రకృతి పరిరక్షణ ప్రతి విద్యార్థి యొక్క బాధ్యత అని వాతావరణ మార్పులను అరికట్టడంలో విద్యార్థులు ఎల్లప్పుడూ ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కిష్టయ్య, వృక్షశాస్త్ర విభాగం నుండి డాక్టర్ దినకర్, స్వాతి, శ్రీలత, ఫారెస్ట్రీ విభాగం నుండి సుచరిన్ దయాన్, ప్రవీణ్ నాయక్ హిందీ ఆచార్యులు డాక్టర్ శ్రీనివాస్ రావు విద్యార్థులు పాల్గొన్నారు.