వరద ప్రభావిత ప్రాంతాలు, బాధితులను కలవనున్న సీఎం..ఆశీష్ సాంగ్వాన్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు జిల్లా కలెక్టర్ సూచనలు

వరద ప్రభావిత ప్రాంతాలు, బాధితులను కలవనున్న సీఎం –-ఆశీష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధ (ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 3

జిల్లాలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతంగా జరగాలని అన్ని శాఖల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. ఈనెల 4వ తేదీ గురువారం ముఖ్యమంత్రి కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు.

ముఖ్యమంత్రి వరదలతో తీవ్రంగా ప్రభావితమైన లింగంపేట మండలంలోని లింగంపల్లి కుర్డు ఆర్ అండ్ బి వంతెన, బుడిగిడా గ్రామంలో ఇసుక మేట కప్పేసిన వరి పొలాలు, కామారెడ్డి పట్టణంలో జీ ఆర్ కాలనీ వద్ద దెబ్బతిన్న రోడ్లు, మునిగిపోయిన ఇండ్లను పరిశీలించి బాధితులను కలవనున్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వరదలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను వీక్షించి, జిల్లా అధికారులతో వరదల సమయంలో చేపట్టిన చర్యలపై సమీక్ష నిర్వహిస్తారు.

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన సాఫీగా సాగేందుకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని అధికారులు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి సమాచారంతో హాజరుకావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ ఎస్పీ సయ్యద్ భాష, అదనపు ఎస్పీ, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, లోకల్ బాడీస్ చందర్‌తో పాటు రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, మున్సిపాలిటీ, వ్యవసాయ, సమాచార పౌర సంబంధాలు, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment