*బల్మూర్ వెంకట్ చొరవతో లబ్ధిదారునికి సీఎం సహాయనిధి చెక్కుల అందివేత*
*జమ్మికుంట ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని మల్లన్నపల్లి గ్రామానికి చెందిన సుంకరి లక్ష్మి గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రిలో చేరగా వైద్యం కోసం అయినటువంటి ఖర్చులకు గాను ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్ధిక సహాయం కావాలని స్థానిక ఇల్లందకుంట మండల ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు పసునూటి అన్వేష్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ని కోరగా వారు వెంటనే స్పందించి బాధితురాలికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్ధిక సహాయాన్ని చెక్ రూపంలో ఇప్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఆకుల రాము బుద్దార్థి ప్రశాంత్ తోట రాజు తదితరులు పాల్గొన్నారు