Site icon PRASHNA AYUDHAM

బడ్జెట్‌‌పై సీఎం చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్..

IMG 20250201 WA0120

Budget 2025: బడ్జెట్‌‌పై సీఎం చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025-26పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎక్స్‌ వేదికగా స్పందించిన ఆయన.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మేలు చేకూర్చే బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. వికసిత్ భారత్‌ విజన్‌ను ప్రతిబింభించేలా బడ్జెట్‌ ఉందని ప్రశంసించారు. మహిళా, పేదల, యువత, వ్యవసాయదారుల సంక్షేమానికి బడ్జెట్ పెద్దపీట వేసిందన్నారు. రానున్న ఐదేళ్లలో ఆరు కీలక రంగాల్లో అభివృద్ధికి ఈ బడ్జెట్ మార్గదర్శకతం చేస్తోందన్నారు చంద్రబాబు. జాతీయ సౌభాగ్యానికి ఈ బడ్జెట్ ఓ ముందడుగు అని పేర్కొన్నారు. దేశ భవిష్యత్‌కు ఈ బడ్జెట్‌ బ్లూ ప్రింట్ లాంటిదన్నారాయన. మధ్యతరగతి వర్గానికి ట్యాక్స్ రిలీఫ్‌, ఈ బడ్జెట్‌లో వచ్చిన అదనపు ప్రయోజనం అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రశంసించారు. ఈ బడ్జెట్‌ను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Exit mobile version