*ఈనెల 5,6 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు సిఎం చంద్రబాబు*
▪️ *7న మంత్రివర్గ సమావేశం*
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 5, 6 తేదీల్లో దిల్లీలో పర్యటించనున్నారు
5వ తేదీ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి దిల్లీ వెళ్తారు.
అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు.
తిరిగి అదేరోజు రాత్రి దిల్లీ నుంచి బయల్దేరి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు.
6వ తేదీ ఉదయం తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన “ప్రపంచ చరిత్ర (ఆది నుంచి నేటి వరకూ)” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అది ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1.50 నిమిషాలకు విశాఖ నుంచి బయల్దేరి నేరుగా ఢిల్లీ వెళ్తారు.
అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆ రోజు రాత్రి అక్కడే బసచేస్తారు.
*7వ తేదీన అమరావతికి తిరిగి వస్తారు.
అదే రోజు చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.
వెలగపూడి సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ ప్రారంభం అవుతుంది.*