అనకాపల్లి జిల్లాలో మరో ‘ఫార్మా’ ప్రమాదం – స్పందించిన సీఎం చంద్రబాబు

అనకాపల్లి జిల్లాలో మరో ‘ఫార్మా’ ప్రమాదం – స్పందించిన సీఎం చంద్రబాబు…

IMG 20240823 WA0070

అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మా ఘటన మరువక ముందే పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి ఘటన జరిగింది. రసాయనాలు కలుపుతుండగా జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన కార్మికులు జార్ఖండ్‌కు చెందినవారిగా గుర్తించారు.ఘటనపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులను వెంటనే వెళ్లాలని ఆదేశించిన సీఎం, మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు.

Join WhatsApp

Join Now