Site icon PRASHNA AYUDHAM

బాణసంచా కేంద్రంలో ప్రమాదంలో ఆరుగురు మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

IMG 20250413 WA1827

*బాణసంచా కేంద్రంలో ప్రమాదంలో ఆరుగురు మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి*

*ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి అనితతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం*

అమరావతి,ఏప్రిల్ 13

అనకాపల్లి జిల్లా, కోటవురట్లలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఆరుగురు కార్మికులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి అనితతో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అగ్నిప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారని, వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందని సీఎం ఆరా తీశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని అన్నారు. ఘటనపై విచారణ చేసి తనకు నివేదించాలని ఆదేశించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు సీఎంకు వివరించారు. అత్యవసరమైన అన్ని రకాల వైద్య సేవలు బాధితులకు అందేలా చూడాలని, బాధితుల ఆరోగ్య పరస్థితిని తనకు ఎప్పటికప్పుడు నివేదించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Exit mobile version