Site icon PRASHNA AYUDHAM

గ్యాంగ్ రేప్ ఘటన పై ఎస్పీతో మాట్లాడిన సీఎం చంద్రబాబు

IMG 20241012 WA00791

శ్రీసత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన సీఎం చంద్రబాబు

 

చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లి సమీపంలో ఘటన

 

నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో కాపలా కోసం వచ్చిన కుటుంబం

 

గత ఐదు నెలలుగా మిల్లు వద్దే ఉంటున్న కుటుంబం

 

గత రాత్రి కత్తులతో బెదిరించి అత్యాకోడళ్లపై అత్యాచారం చేసిన దుండగులు

 

శ్రీసత్యసాయి జిల్లాలో కొందరు దుండగులు అత్తాకోడళ్లపై అత్యాచారానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లి సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. 

 

ఇక్కడ నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో కాపలా కోసం బళ్లారి నుంచి ఓ కుటుంబం వచ్చింది. ఆ కుటుంబం గత ఐదు నెలలుగా ఇక్కడే పేపర్ మిల్లు వద్దే ఉంటోంది. అయితే, గత రాత్రి బైక్ లపై వచ్చిన దుండగులు ఆ కుటుంబ యజమానిని, అతడి కుమారుడ్ని కత్తులతో బెదిరించి… అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

 

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన ఈ గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీ రత్నతో ఆయన మాట్లాడారు. ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి ఘటనపై దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చెయ్యాలని సీఎం ఆదేశించారు.

Exit mobile version