Site icon PRASHNA AYUDHAM

100 రోజుల్లో గాడిన పెడతాం:సీఎం చంద్రబాబు..

 

అమరావతి అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మంగళగరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వినతులు అన్నింటిని పరిష్కరించడమే తమ లక్ష్యమన్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సమస్యలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైకాపా కారణంగా ప్రతి మండలంలోనూ ఓ భూకుంభకోణం వెలుగు చూస్తోందని తెలిపారు. రికార్డులను కూడా తారుమారు చేశారని చంద్రబాబు ఆరోపించారు.

‘‘రీసర్వే అస్తవ్యస్తంగా జరగడం వల్లే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయి. ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తాం. రెవెన్యూ శాఖను గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారు. మదనపల్లె ఘటనే రెవెన్యూ శాఖ నిర్వీర్యానికి ఉదాహరణ. వ్యవస్థలను 100 రోజుల్లో గాడిన పెడతాం. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తాం. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. సమస్యలను విభాగాల వారీగా విభజించి పరిష్కరిస్తాం. వినతులు ఇచ్చేందుకు అమరావతి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. నియోజకవర్గాలు, జిల్లాల్లో ఫిర్యాదులు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తాం. నా పర్యటనల వల్ల ఎవరూ ఇబ్బందిపడకుండా మార్పులు తెస్తాం. శాఖల వారీగా సమీక్షలు సత్ఫలితాలు ఇస్తున్నాయి’’ అని చంద్రబాబు తెలిపారు..

Exit mobile version