ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పధకాన్ని సోంపేట నుంచి ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు 

ఈ నెల 31న శ్రీకాకుళం జిల్లాకు రానున్న చంద్రబాబు నాయుడు

ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పధకాన్ని సోంపేట నుంచి ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 31వ తేదీన గురువారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు రానున్నారు.పర్యటన ఏర్పాట్లకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు సమాచారం వచ్చినట్లు ఆదివారం తెలిపారు. గురువారం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకార్యక్రమాన్ని ఇచ్ఛాపురం నియోజకవర్గం లోని సోంపేటలో ప్రారంభించ నున్నారు.సీఎం పర్యటన సభాస్థలిని పరిశీలించేందుకు ఎమ్మెల్యే బెందాళం అశోక్, ఇన్ఛార్జి ఆర్డీవో కృష్ణమూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now