జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

త్వరలో జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

ఇచ్చాపురం నియోజకవర్గంలో అధికారుల సుడిగాలి పర్యటన.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో వచ్చే నెల మొదటి వారంలో పర్యటించనున్నారనే సమాచారం నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు బెందాళం అశోక్ తో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ లు నియోజకవర్గం లోని సోంపేట, ఇచ్చాపురం, కంచిలి మండలాలలో కొర్లాం, ఈదుపురం, పద్మతుల గ్రామాలను సోమవారం సందర్శించారు. ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారి జిల్లాకు చంద్రబాబు వస్తున్నారు. దీపావళి సందర్భంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను అందజేసే కార్యక్రమాన్ని ఆయన జిల్లా నుంచి లాంఛనంగా ప్రారంభించ నున్నారు. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా రెండవ అతి పెద్ద కార్యక్రమాన్ని జిల్లా నుంచే ప్రారంభించ నుండటంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏ గ్రామం అనుకూలంగా ఉంటుందనే విషయమై అధికారులంతా ఆయా గ్రామాల్లో పర్యటించారు.హెలీ ప్యాడ్ ఏర్పాట నుంచి, బహిరంగ సభకు అనువైన ప్రాంతాలు, పార్కింగ్ తదితర అంశాలను వారు పరిశీలించారు. ఆర్డీవో, ఆయా మండలాల తాసిల్దార్లు, తదితర అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now