దివ్యాంగులు, ఆరోగ్య పింఛన్లపై సీఎం స్పష్టత

దివ్యాంగులు, ఆరోగ్య పింఛన్లపై సీఎం స్పష్టత

తాత్కాలిక సదరం సర్టిఫికెట్లు ఉన్నా… అర్హులకు పింఛన్లు యథావిధిగా

నోటీసులు వెనక్కి తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం

‘నకిలీ పింఛన్లనే తొలగించాలి.. నిజమైన అర్హులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు’ స్పష్టం

గత ప్రభుత్వంలో అడ్డదారిలో సర్టిఫికెట్లు.. అనర్హులకూ పింఛన్లు చేరిన వాస్తవం

సమీక్షలో అధికారుల నివేదికపై సీఎం చంద్రబాబు క్లారిటీ

అమరావతి, ఆగస్టు 22:

దివ్యాంగులు, ఆరోగ్య పింఛన్లపై ఎలాంటి సందేహం లేకుండా అర్హులందరికీ నెలనెలా పింఛన్లు కొనసాగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సదరం ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందుతున్న వారికి పంపిన నోటీసులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన గురువారం సచివాలయంలో జరిగిన సమీక్షలో అధికారులకు ఆదేశించారు.గత ప్రభుత్వ కాలంలో అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు తీసుకుని అనర్హులు కూడా పింఛన్లు పొందుతున్నట్లు ప్రత్యేక వైద్యబృందాల పరిశీలనలో తేలిందని అధికారులు వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ– “నకిలీ పింఛన్లను మాత్రమే తొలగించాలి. అర్హులైన దివ్యాంగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు” అని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment