Site icon PRASHNA AYUDHAM

సీఎం కప్ 2024 టార్చ్ ర్యాలీ..

గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేయాలని, పల్లెల నుండి ప్రపంచ ఛాంపియన్లను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 టార్చ్ ర్యాలీ జిల్లా కేంద్రం చేరుకుంది.. మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్, అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో , రెవెన్యూ డేవిడ్, అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, స్వాగతం పలికి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం కప్ నోడల్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ కన్నం మధు, జిల్లా స్పోర్ట్స్ అధికారి అనిల్, గోకుల్, రతన్ కుమార్ బోస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్, జిల్లా అధికారులు కలెక్టరేట్ లోని అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు,

Exit mobile version