పశ్చిమ బెంగాల్లో అల్లర్లు.. యుపి, అస్సాం, దిల్లీ కూడా తగలబడతాయని పీఎం మోదీకి ..సీఎం మమత హెచ్చరిక….
పశ్చిమ బెంగాల్లో అల్లర్లు.. యుపి, అస్సాం, దిల్లీ కూడా తగలబడతాయని పీఎం మోదీకి సీఎం మమత హెచ్చరికకోల్‌కతాలో వైద్యురాలి పై అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో బుధవారం పశ్చిమ బెంగాల్లో బీజేపీ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కాస్తా హింసాత్మకంగా మారింది. ఈ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ సీఎం మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “బెంగాల్ మండితే ఉత్తరప్రదేశ్, అస్సాం, బిహార్, జార్ఖండ్, ఒడిశా, దిల్లీ కూడా తగలబడతాయని గుర్తుంచుకోండి” అంటూ ఆమె హెచ్చరించారు.