*నేడు బీసీ నేతలతో సీఎం భేటీ*
TG: కాంగ్రెస్ బీసీ నేతలతో నేడు (శనివారం)
సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో జరిగే ఈ సమావేశంలో సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్ గౌడ్, సీనియర్ బీసీ నాయకులు పాల్గొననున్నారు. కులగణన సర్వే చేపట్టిన అంశాన్ని సీఎం వారికి వివరించనున్నారు. బీసీ రిజర్వేషన్ల చట్టం కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, తీర్మానం చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై చర్చించనున్నారు.