విజయ డైరీ కి పునరుజ్జీవం- సీఎం ప్రశంసలు
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (ప్రశ్న ఆయుధం):
విజయ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలోమర్యాదపూర్వకంగా కలిశారు.
చైర్మన్ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం కి శాలువాతో సత్కారం.
నెలకు రూ.10 కోట్ల నష్టాల్లో ఉన్న విజయ డైరీని లాభాల్లోకి తీసుకొచ్చినందుకు సీఎం అభినందనలు.
పాడి రైతుల సంక్షేమానికి లాభాలను వినియోగించాలని సీఎం సూచనలు.
అమ్మకాలను పెంచి, పూర్తి లాభాల్లోకి తీసుకువస్తానని గుత్తా అమిత్ రెడ్డి హామీ.
విజయ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గత ఏడాది సెప్టెంబర్ 5న బాధ్యతలు స్వీకరించిన అమిత్ రెడ్డి, నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం కి శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.
నెలకు రూ.10 కోట్ల నష్టాల్లో ఉన్న విజయ డైరీని కేవలం ఏడాదిలోనే నిర్వహణా లాభాల్లోకి తీసుకువచ్చిన చైర్మన్ ప్రతిభను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఇకపై మరింత పట్టుదలతో పని చేసి లాభాలను పాడి రైతుల సంక్షేమానికి వినియోగించాలని సీఎం సూచించారు.
వచ్చే ఏడాదిలో అమ్మకాలను పెంచి, సంస్థను పూర్తి లాభాల్లోకి తీసుకువస్తానని గుత్తా అమిత్ రెడ్డి ముఖ్యమంత్రి కి హామీ ఇచ్చారు.