Site icon PRASHNA AYUDHAM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

IMG 20250725 WA00591

*సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం, జూలై 25:

నాగారం మున్సిపాలిటీకి చెందిన ఉప్పరి తిరుపతి సాగర్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) నుంచి మంజూరైన రూ. 60,000 చెక్కును శుక్రవారం రోజు నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అందజేశారు.

ఈ సందర్భంగా నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఈ నిధులు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాగారం మాజీ కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాళ్ల అశోక్ యాదవ్, మాజీ వార్డు సభ్యులు సత్యం సాగర్, సీనియర్ నాయకులు గూడూరు చక్రపాణి గౌడ్, మామిళ్ళ కృష్ణ యాదవ్, షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version