Site icon PRASHNA AYUDHAM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కాట శ్రీనివాస్ గౌడ్

IMG 20250118 175826

Oplus_131072

సంగారెడ్డి/పటాన్ చెరు, జనవరి 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తామంతా నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తున్నామని, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నామని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కష్టకాలంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది, అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కాట శ్రీనివాస్ గౌడ్ నివాసంలో చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Exit mobile version