Site icon PRASHNA AYUDHAM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Screenshot 20241119 1948312

ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 19 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. వివిధ కారణాలతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న కిష్టయ్య, శ్రీనివాస్ అనే వ్యక్తులకు నిధులు మంజూరు కాగా నేడు వారి బంధువులకు చెక్కులను అందజేశారు. సీఎం సహాయనిధి పథకం నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

Exit mobile version