Site icon PRASHNA AYUDHAM

ముగ్గురు మంత్రులకు CM రేవంత్ బిగ్ షాక్..

IMG 20250613 WA2277

ముగ్గురు మంత్రులకు CM రేవంత్ బిగ్ షాక్..

తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముగ్గురు సీనియర్ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖలకు జిల్లా ఇన్‌చార్జ్ బాధ్యతలు నుంచి తొలగించారు. వారి స్థానంలో కొత్త మంత్రులకు జిల్లా ఇంఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. గడ్డం వివేక్‌కు ఉమ్మడి మెదక్ జిల్లా బాధ్యతలు, అడ్లూరి లక్ష్మణ్‌కు నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లా ఇంఛార్జిగా వాకిటి శ్రీహరికి బాధ్యతలు అప్పగించారు.

గతంలో ఖమ్మం జిల్లా ఇంఛార్జిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మెదక్ జిల్లా ఇంఛార్జిగా పనిచేసిన కొండా సురేఖ, కరీంనగర్ జిల్లా ఇంఛార్జిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి లు పని చేశారు. అలాగే ఇదివరకే మంత్రివర్గంలో ఉన్న కొందరికి జిల్లాల ఇంఛార్జ్‌ల బాధ్యతలు మార్పులు చేశారు. నల్లగొండ జిల్లా ఇంఛార్జిగా ఉన్న తుమ్మలకు కరీంనగర్ జిల్లా బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ జిల్లా ఇంఛార్జిగా ఉన్న జూపల్లికి ఆదిలాబాద్, ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జిగా ఉన్న సీతక్కకు నిజామాబాద్ జిల్లా కేటాయించారు. గత కొన్నిరోజులుగా కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Exit mobile version