Site icon PRASHNA AYUDHAM

టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి!

IMG 20250222 WA0106

*టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి!*

*సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లిన మంత్రులు అధికారులు*

హైదరాబాద్ :

ఐదేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత.. నాలుగు రోజుల కిందటే టన్నెల్ సొరంగ పనులు ప్రారంభమైన సంగతి పాఠకులకు తెలిసిందే, కాగా ఈరోజు ఉదయం నాగర్‌ కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో.. పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదంలో గాయపడిన వాళ్లు, లోపల చిక్కుకు పోయిన కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా తెలుస్తోంది. కాగా.. హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు సహాయ క చర్యలు ప్రారంభించారు.

గాయపడిన కార్మికులను స్థానిక జెన్‌కో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు కార్మికులను బయటకు తీసుకురాగా.. తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

*ఈ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి*

*సంఘటన స్థలానికి బయలుదేరిన మంత్రులు, అధికారులు*

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద

జరిగిన ప్రమాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్‌ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే రేవంత్ రెడ్డి.. అధికారులను అప్రమత్తం చేశారు.

జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికా రులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగే షన్ అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు.

Exit mobile version