రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు(మంగళవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరగనున్న అఖిలపక్ష ఎంపీల భేటీలో రేవంత్ పాల్గొననున్నారు. బీసీ రిజర్వేషన్లు, కులగణన నిర్ణయాలు రేవంత్ వివరించనున్నారు. బీసీల విషయంలో మోడల్ తెలంగాణ పేరిట అఖిలపక్ష ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే ప్రధాని మోదీని కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపునకు సీఎం సహకారం కోరనున్నారు.