ఖైరతాబాద్ మహాగణపతి దర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

ఖైరతాబాద్ మహాగణపతి దర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

71 ఏళ్ల ఉత్సవాలకు ప్రభుత్వ మద్దతు – ఉచిత విద్యుత్‌తో ప్రత్యేక గుర్తింపు

హైదరాబాద్‌, సెప్టెంబర్ 5:

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి భక్తులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

“దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో గణపతి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాం. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు చేశాం” అని తెలిపారు.

71 ఏళ్ల చరిత్ర గల ఖైరతాబాద్ గణపతి ఉత్సవ కమిటీని అభినందించిన సీఎం, “దేశంలో గణనాయకుడి ఉత్సవాలంటే ఖైరతాబాద్ గణపతే గుర్తుకు రావాలి అన్న స్థాయికి ఈ ఉత్సవాలను తీసుకువెళ్లారు” అని అన్నారు.

నిమజ్జనాల సందర్భంలో ఎటువంటి సమస్యలు రాకుండా ట్యాంక్‌బండ్ సహా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. “అన్ని మతాలను గౌరవించే నగరంగా హైదరాబాద్ నిలుస్తుంది. భక్తి, శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం పూర్తిచేయాలని కోరుతున్నా” అని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment